బాణసంచా తయారీ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివనాగబాబు అన్నారు. గండేపల్లి శివారు పుష్కర కాలువ పక్కన ఉన్న బాణసంచా తయారీ కేంద్రాన్ని పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు గురువారం పరిశీలించారు. ఎస్ఐ మాట్లాడుతూ తయారీ కేంద్రంలో నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని, నిల్వలను గృహాల వద్ద ఉంచరాదని, బాలలను పనిలో పెట్టరాదని సూచించారు. డిప్యూటీ తహసీల్దారు దివ్యభారతి పాల్గొన్నారు.