గోదావరి మహా పుష్కరాలు – 2027 నిర్వహణ నేపథ్యంలో కొవ్వూరులో అభివృద్ధి పనుల విషయంలో ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం కొవ్వూరులో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, మౌలిక వసతులు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నివేదిక సిద్ధం చేయాలన్నారు.