రాజమహేంద్రవరంలో గణపతి నిమజ్జన మహోత్సవం

రాజమహేంద్రవరంలో గణపతి నవరాత్రుల వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఉదయం శాస్త్రోక్తంగా ఉద్వాసన కార్యక్రమం నిర్వహించగా, సాయంత్రం కన్నుల పండువగా నిమజ్జన మహోత్సవం ఘనంగా సాగింది. కొవ్వూరు నియోజకవర్గం, చాగల్లు మండలం మార్కొండపాడు జనసేన నాయకులు, పంతులు బోడెం వెంకట సుబ్రహ్మణ్యం శర్మ ఆధ్వర్యంలో, కమిటీ సభ్యుల సహకారంతో ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. మేళతాళాలు, భజనల నడుమ భక్తులు గణనాథునికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికి నిమజ్జనం పూర్తి చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕