కొవ్వూరు పట్టణంలోని 13వ వార్డులో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ పై ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి GST తగ్గింపు వల్ల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వివరించారు. మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చటమే లక్ష్యంగా జీఎస్టీ సంస్కరణలు తెచ్చారని ఆయన పేర్కొన్నారు.