అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం, కొమరిపాలెం గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పర్యవేక్షించి, ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు ఆసరా కల్పించాలని కోరారు.