కొవ్వూరులో జై భీమ్ దళిత ప్రజా వేదిక కార్యవర్గ సమావేశం.

కొవ్వూరు లిటరరీ క్లబ్లో జై భీమ్ దళిత ప్రజావేదిక కార్యవర్గ సమావేశం, దళిత ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. జై భీమ్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దళితుల సమస్యలు, సామాజిక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులను నూతనంగా ఎన్నిక చేశారు. ఈ కార్యక్రమంలో మాలల రాజ్యాధికార సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పొట్ల విజయకుమారి, దళిత ఐక్యవేదిక నాయకుడు గెడ్డం శ్రీనివాస్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕