చాగల్లులోని మాతంగ చెరువుగట్టుపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 10,000 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మాజీ రాజమహేంద్రవరం ఉడా ఛైర్మన్ షర్మిల రెడ్డి, ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ ప్రజా వేదిక అధ్యక్షుడు గూడూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు గోవింద వఝల శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కలశంతో స్వాగతం పలికారు.