కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామంలో కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సుపరి పాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో డోర్ టు డోర్ తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తక్షణమే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నారు.