కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు వారి సమస్యలు తెలుపుతూ వినతిపత్రాలను అందించారు. అనంతరం మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా సేవా మేరా యోగ్ దాస్ కార్యక్రమం నిర్వహించి కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో NDA కూటమి నాయకులు పాల్గొన్నారు.