తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ఎంపీడీవో

తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరులో అల్పపీడన ప్రభావంతో గురువారం ఉదయం నుండి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో, ఎంపీడీవో ఆర్. శ్రీదేవి చంద్రవరం, నెలటూరు, చిక్కాల గ్రామాల్లో తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను, కూలిపోయిన తోటలను, చెట్లను, పారిశుధ్య పనులను సిబ్బందితో కలిసి పర్యటించారు. అవసరమైన చోట్ల సహాయక చర్యలు వెంటనే చేపట్టారు. చెట్లను తొలగించడం, ముంపు ప్రాంతాల నుండి నీటిని తరలించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. ఆరోగ్య సమస్యలపై సూచనలు కూడా చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕