తూర్పు గోదావరి జిల్లా నూతన పదాధికారులతో ప్రత్యేక సమావేశం బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర గురువారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు, కోశాధికారి, ఐటి కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్ చేయవలసిన విధులను, బాధ్యతలను తెలియజేశారు. జిల్లాలో "శక్తివంతమైన బీజేపీ నిర్మాణం" కోసం అందరూ సంకల్పంతో కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.