చాగల్లులో ఘనంగా తెలగా సంఘం వారి గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం

చాగల్లు సంఘం సంఘం శ్రీ విగ్నేశ్వర ఆలయం కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఈనెల 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. 23వ తేదీ బుధవారం స్వామివారిని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా భారీగా పుర విధులులో ఊరేగింపు చేపట్టారు. ఊరేగింపు మేళా తాళలు, బుట్ట బొమ్మలు, విచిత్ర వేషాలతో అంగ రంగ వైభవంగా జరిపారు. భక్తులు స్వామివారికి తీర్థ ప్రసాదలను సమర్పించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు గండ్రోతు సురేంద్ర కుమార్, తెలగా సంఘం సభ్యులు, భక్తులు కార్యక్రమంలో విరివిగా పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕