నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు అప్పారావు శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల విక్రయం ద్వారా రూ. 1, 47, 469 ఆదాయం వచ్చినట్లు ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ హరిసూర్యప్రకాష్ తెలిపారు.