నిడదవోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల నందు గురువారం తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే పిల్లలు మాదక ద్రవ్యాలకు దూరంగా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.