ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా వచ్చిన ఓ సమస్య పరిష్కారంపై నగరపాలక సంస్థ కమిషనర్ భావన గురువారం క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలనకు వెళ్లారు. కొమరగిరి లేఅవుట్ పరిధిలో ఉన్న ఓ మూడు ఎకరాల రైతు తన చేనుకు నీరందడం లేదని, సమీపంలో ఉన్న ఇరిగేషన్ కెనాల్ ద్వారా నీరందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు కమిషనర్ భావన అధికారులతో కలిసి లేఔట్ ప్రాంతాన్ని సందర్శించారు.