రాజమండ్రిలో బీజేపీలో చేరిన 23 మంది కార్యకర్తలు

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీ సోము వీర్రాజు సమక్షంలో 23 మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సోము వీర్రాజు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రెసిడెంట్ రావణమ్మ, ప్రధాన కార్యదర్శి వీరభద్రరావు, మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఓబీసీ మోర్చా నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా పార్టీలో చేరిన కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕