మన బాధ్యత ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గారా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాజమండ్రి సంజీవని వాలంటరీ బ్లడ్ సెంటర్ నందు 365 రోజుల పాటు రక్తదాన అవగాహన కార్యక్రమం బుద్దాల గ్రూప్ ఆఫ్ చైర్మన్ బుద్దాల నాని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరం రక్తదానం గురించి అవగాహన కల్పించి, రక్తదాతలుగా మారుస్తూ ముందుకు వెళ్తున్నామని, గత 11 సంవత్సరాలుగా ఆపదలో ఉన్న వేలాది మందికి సకాలంలో రక్తం అందించామని తెలిపారు. రక్తదానం చేయాలనుకునేవారు 9703167031 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.