బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

రాజమహేంద్రవరంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో యువ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పిక్కి నాగేంద్ర, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్ముల దత్తు , పార్టీ ప్రధాన కార్యదర్శి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕