కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1 నుండి 7 వరకు జరుగుతున్న BRICS సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లొ ఆర్టీసీ రాజమండ్రి డిపోలో డిపో మేనేజర్ ఆధ్వర్యంలో 2వరోజు శక్తిని ఆదా చేయడం అనే కార్యక్రమం నిర్వహించి వాడుతున్న పాత బల్బుల స్థానంలో కొత్త LED లైట్లను అమర్చడమైనది. తక్కువ పికప్, నల్లటి పోగ వాహనాలను మరమ్మతులు చేయడమైనది. డ్రైవర్లకు శక్తిని ఆదా చేయడానికి ఉపయోగపడే డ్రైవింగ్ టెక్నిక్స్ ను నేర్పడమైనది. 3వరోజు నీటిని ఆదా చేయడం అనే కార్యక్రమం నిర్వహించి లీకేజీ పైపులను మరమ్మతులు చేశారు. 4వ రోజు సీనియర్ మెడికల్ ఆఫీసర్ ప్రసునాంభని ఆహ్వానించి వారిచే మంచి ఆహార అలవాట్లను ఎలా అవలంబించాలో నేర్పారు.