తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనతా వినాయకుడి విగ్రహ నిమజ్జన కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర స్వయంగా వినాయకుడి విగ్రహాన్ని మోసుకుని నిమజ్జనానికి తరలించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు.