మాజీ కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు గుత్తుల మురళీధరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావుతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కార్పొరేటర్ గా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గుత్తుల మురళీధరరావు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు.