25 కోట్ల బాలల కలలు' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజమహేంద్రవరం ఎస్కేవీటీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్శిపల్లి హరిక పాల్గొన్నారు. పోటీల్లో విద్యార్థులు తమ అద్భుతమైన కళానైపుణ్యాన్ని, వాగ్ధాటిని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. బాలల కలలకు రెక్కలు తొడిగి, వారి భవిష్యత్తుకు బాటలు వేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.