ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మంగళవారం రాజమండ్రిలో ఇద్దరికి సుమారు రూ. 7 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందచేశారు. సిటీ నియోజకవర్గంలో ఇంత వరకు 149 మందికి రూ. కోటి 99 లక్షల వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందచేశామని చెప్పారు.