రాజమండ్రి: ఆగస్టు 6, 7వ తేదీలలో సీపీఐ జిల్లా మహాసభలు

ఆగస్టు 6, 7వ తేదీలలో భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) 26వ జిల్లా మహాసభలు రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. గురువారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. 6వ తేదీ స్థానిక సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ, 7వ తేదీ ఆనం రోటరీ హాల్లో సభ జరుగుతుందన్నారు. కావున కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు నగర ప్రజలు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్