దసరా పండుగ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీసీ 282 ప్రత్యేక బస్సులను నడపనుంది. ప్రజా రవాణా అధికారి ఎంయూవీ. మనోహర్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 81 ప్రత్యేక బస్సులు అదనంగా ఏర్పాటు చేశారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.