ధవళేశ్వరం బ్యారేజ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజమండ్రి రూరల్ పరిధిలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి బ్యారేజీని పరిశీలించారు. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఆమె చర్చించారు.

సంబంధిత పోస్ట్