రాజమండ్రి రూరల్: గోదావరిలో తగ్గుముఖం పట్టిన నీటిమట్టం

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరిలో నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఇన్ ఫ్లో 3, 22, 484 క్యూసెక్కులు ఉన్నట్లు ఈఈ జి. శ్రీనివాస్ తెలిపారు. బ్యారేజీ నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు సాగునీటి అవసరాల నిమిత్తం 14, 400 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నామన్నారు. అలాగే మిగిలిన నీటిని ఆనకట్ట నుంచి దిగువకు వదులుతున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్