సెల్ ఫోన్ అధికంగా వినియోగిస్తున్నాడని తల్లి మందలించడంతో తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి (14) ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారపు పేటకు చెందిన ఈ బాలుడు గత 29వ తేదీ మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. ఈ ఘటనపై ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసుకుని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.