సీతానగరం మండలం రాజంపేట సమీప మునికూడలి ఇసుక ర్యాంపు వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. మృతులు పసుపులేటి దుర్గాప్రసాద్ (15), అల్లూరి మహి (14)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.