తూ. గో జిల్లాలో ప్రాథమిక రంగానికి అనుబంధ పరిశ్రమలను స్థాపించే దిశగా ఔత్సాహికులను ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. శనివారం రాజమండ్రిలో జరిగిన పరిశ్రమల-ఎగుమతుల ప్రోత్సాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖలు పోస్ట్ హార్వెస్టింగ్ యూనిట్లు, పశుసంవర్ధక శాఖ డైరీ & పాల ఉత్పత్తుల పరిశ్రమలు, మత్స్య శాఖ ఫీడ్ ఉత్పత్తి యూనిట్ల స్థాపనకు కృషి చేయాలని తెలిపారు. అధికారులు చురుకుగా ప్రోత్సహించాలని ఆదేశించారు.