విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోండి

ప్రస్తుత తుఫాను ప్రభావం నేపథ్యంలో, కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం రాత్రి రాజానగరం సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని, ప్రజలకు విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్