2023లో తుని పరిధిలో జరిగిన ఆటో దోపిడీ కేసులో ఇద్దరు నిందితులకు పిఠాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. యూపీ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన నిందితులు రాజులకొత్తూరు సమీపంలో ఆటో డ్రైవర్‌పై కత్తితో దాడి చేసి ఆటోను దోచుకెళ్లారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు అధికారులను తుని ఎస్సై కృష్ణమాచార్యులు అభినందించారు.