షెడ్యూల్ కులాల వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తుని పట్టణంలోని గొల్ల అప్పారావు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు చీలి ప్రసాద్ ఆధ్వర్యం ర్యాలీ నిర్వహించారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీరవరపు పేట, రామకృష్ణ నగర్, తారక రామా నగర్ లో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.