తుని మండలం తపోవనం ఆశ్రమంలో శ్రావణ మాస పూజలు ప్రారంభమయ్యాయి. తాండవ కాశి క్షేత్రముగా ప్రసిద్ధిగాంచిన తపోవనంలో సోమవారం స్వామీజీ శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ. మహాశివరాత్రి కన్నా దుర్లభమైన ప్రతి శ్రావణ సోమవారం తపోవనంలో విశేష శివ సంపర్య భవాని తాండవేశ్వరనుకు రుద్రాభిషేకం, రుద్ర క్రమార్చన జరుగును అన్నారు.