మినీ జాబ్ మేళాలో 21 మందికి ఉద్యోగాలు

అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన మినీ జాబ్ మేళాలో 21 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. దివీస్ సహా పలు కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగులకు వార్షిక వేతనం 2.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు ఉంటుందని కంపెనీలు తెలిపాయి. ఉద్యోగాలు పొందిన వారిలో 19 మంది కళాశాల విద్యార్థులేనని ప్రిన్సిపల్ కె. మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్