అయినవిల్లి: ఒరిగిపోయిన విద్యుత్ స్థంభం

అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద విద్యుత్ స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో పడిపోకుండా తాడు సహాయంతో కొబ్బరి చెట్టుకి కట్టుకున్నట్లు స్థానిక మహిళ దంగుడు బియ్యం సరస్వతి తెలిపారు. ఆ మార్గంలో స్కూలు విద్యార్థులు సైతం వెళ్తున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె శుక్రవారం కోరారు.

సంబంధిత పోస్ట్