అమలాపురం ఎత్తు రోడ్డు సమీపంలో హెచ్. పి. గ్యాస్ కంపెనీ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన రేవు దినేష్ కుమార్ (28) అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా, రాజోలు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, బస్సును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.