అమలాపురంలో అల్లు అర్జున్ జన్మదిన వేడుకలు: అన్నదానం, గోవులకు దానం

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జన్మదిన వేడుకలను అమలాపురంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. వర్రే శేషు ఆధ్వర్యంలో స్థానిక గీత ఆశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనాధలకు అన్నదానం చేసి, గోవులకు దానా నిమిత్తం నగదును ఆశ్రమం సెక్రెటరీ కోకా రాంబాబుకు అందజేశారు. ఈ సామాజిక సేవ కార్యక్రమాల్లో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్