అమలాపురం: లో వోల్టేజీ సమస్య లేకుండా చర్యలు: ఎమ్మెల్యే

విద్యుత్ లో వోల్టేజీ సమస్య లేకుండా చర్యలు చేపడుతున్నట్లు అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు తెలియజేశారు. అమలాపురం పట్టణం వడ్డిగూడెంలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, ఆముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, రాష్ట్ర వాణిజ్య విభాగం కర్రి రామస్వామి, తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్