అమలాపురం: కామాక్షి పీఠం ట్రస్ట్‌కు బాలుడి అప్పగింత

అమలాపురం పట్టణంలో నాలుగు రోజుల క్రితం రాత్రి ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గుమ్మళ్ల సురేశ్ అనే వ్యక్తి మానవత్వంతో ఆదుకున్నారు. గత నాలుగు రోజులుగా ఆ బాలుడిని తన ఇంటి వద్ద ఉంచుకుని సంరక్షించిన సురేశ్, శనివారం తన స్నేహితుల సహాయంతో కామాక్షి పీఠం ట్రస్ట్ ప్రతినిధులు వాణి, దుర్గారావులకు ఆ బాలుడిని అప్పగించారు. బాలుడి తల్లిదండ్రుల వివరాలు తెలిసినవారు అమలాపురం పోలీసులకు లేదా స్థానిక స్వచ్ఛంద సంస్థలకు సమాచారం అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్