అమలాపురంలో మహేష్ బాబు సినిమా 'బిజినెస్ మేన్' రీ-రిలీజ్ సందర్భంగా నేదునూరుకు చెందిన కేతా హేమవర్ధన్ అనే యువకుడు హల్ చల్ చేశాడు. తలపై బీరు సీసాతో కొట్టుకుని, పెట్రోల్ సీసా చేతిలో పట్టుకుని రోడ్డుపై నృత్యం చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆదివారం ఎస్సై కిషోర్ బాబు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.