అమలాపురం: 'చంద్రబాబు ఆరోపణలు అబద్ధమని తేలిపోయాయి'

అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు పినిపే శ్రీకాంత్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డూపై వచ్చిన నిందలు తొలగిపోవాలని కోరుకుంటూ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధమని తేలిపోయాయని, కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, దీనికి చంద్రబాబు, లోకేష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్