అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో కలెక్టర్ మహేష్ కుమార్ ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనపై సోలార్ రూఫ్‌టాప్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 1004 యూనిట్లకు కనెక్షన్లు ఇచ్చారని, ఆగస్టు 15 కల్లా మరిన్ని కనెక్షన్లు అందుబాటులోకి తేవాలన్నారు. పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని, 300 యూనిట్ల పరిమితి వాడకానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.