అమలాపురం: 'సమస్యలు పరిష్కరించకుంటే క్రాప్ హాలిడే'

అమలాపురంలో శుక్రవారం జరిగిన రాష్ట్రస్థాయి అత్యవసర సమావేశంలో ఆక్వా రైతులు తమ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఫీడ్, సీడ్ ధరలు, తగ్గించిన రొయ్యల రేట్లతో డీలర్ల సిండికేట్ వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా తమను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఆక్వా జోన్లతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ. 1. 50లకే సబ్సిడీ విద్యుత్ అందించాలని, రొయ్యల ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ‘క్రాప్ హాలిడే’ ప్రకటించి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్