అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పోలీసు శాఖ అర్ధ సంవత్సరం సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. వివిధ కేసులు, నేరాలకు సంబంధించిన బాధితులకు సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బాలికలు, మహిళల భద్రతకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో చర్చించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.