అమలాపురం రైతు బజార్ సెలవు దినం మార్పు: ఇకపై బుధవారం మూత

అమలాపురం రైతు బజార్ వారంతపు సెలవు దినాన్ని మార్కెటింగ్ శాఖ మార్చింది. రైతులు, వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మంగళవారం ఉన్న సెలవును ఇకపై బుధవారానికి మార్చినట్లు ఏడీ విశాలాక్షి తెలిపారు. ప్రతి బుధవారం రైతు బజార్ మూసి ఉంటుందని, మిగిలిన రోజుల్లో యథావిధిగా పనిచేస్తుందని ఎస్టేట్ ఆఫీసర్ స్వర్ణలత పేర్కొన్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్