అమలాపురంలో ఆదివారం శ్రీ సుబ్బాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని హైస్కూల్ సెంటర్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయగా, మంత్రి వాసంశెట్టి సుభాశ్ గారు అమ్మవారి గరగను ఎత్తుకుని దర్శించుకున్నారు. మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు అద్భుతంగా సాగింది.