అమలాపురం మండలం కామనగరువు సబ్ స్టేషన్లో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని ట్రాన్స్కో ఈఈ రాంబాబు తెలిపారు. ఈ సమయంలో అమలాపురం కోర్టు, న్యూ హెచ్బీ కాలనీ, ఓల్డ్ హెచ్బీ కాలనీ, వేంకటేశ్వరస్వామి టెంపుల్, ఎర్ర వంతెన, చింతలపూడి, తాండపల్లి, ఏ.వేమవరం ప్రాంతాలకు విద్యుత్ ఉండదని తెలిపారు.