రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఉప్పలగుప్తం మండలం, నంగవరంలో శుక్రవారం జరిగిన సుపరిపాలన తొలిఅడుగు కార్యకమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అందించిన సంక్షేమాన్ని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు తదితరులు పాల్గొన్నారు.