ఆత్రేయపురం సెక్షన్ పరిధిలోని అంకంపాలెంలో విధి నిర్వహణలో ఉన్న లైన్‌మెన్ కె.నారాయణ ప్రసాద్‌పై ఓ వినియోగదారుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు తోటి సిబ్బంది తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రసాద్ అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోగా, తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, మాట్లాడలేని స్థితిలో ఉన్నారని సమాచారం. దాడికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది.